నెల్లూరు జిల్లా కావలిలో ముసునూరు దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు దుర్మార్గంగా తొలగించి, బావిలో పడేసేందుకు ప్రయత్నించారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా విగ్రహాన్ని తొలగించారని ఆక్షేపించారు. పార్లమెంటులోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కావలిలో తొలగించడం హేయమన్నారు. విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించకుంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలని లేకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి : 'ఆనం సంజీవరెడ్డి కెనాల్ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం'