Heavy rains in Nellore district: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని కావలి ఉదయగిరి నియోజకవర్గం గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయగిరి ,కావలి నియోజకవర్గలలో జలదంకి, కావలి తుమ్మలపెంట ప్రధాన రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కావలి పట్టణంలోని వైకుంఠపురం, జనతా పేట, బాలకృష్ణ రెడ్డి నగర్, పలు ప్రాంతాల్లో నీ నివాసాలకి వర్షపు నీరు చేరి స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మండల పరిధిలోని బుడమ గుంట గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలకు వెళ్లే ప్రాంతమంతా చెరువును తలపిస్తుంది. తెదేపా కావలి నియోజకవర్గం ఇన్చార్జి మాలేపాటి సుబ్బా నాయుడు నాయకులతో కలిసి జగనన్న కాలనీలను పరిశీలించారు. కావలి మండల పరిధిలోని చెన్నై పాలెం వెళ్లే మార్గమధ్యంలో గుమ్మడి బొందల గ్రామం వద్ద సపట ప్రవాహాన్ని ఆర్డీఓ శీనా నాయక్తో కలిసి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించారు.. ముంపు విషయంపై జిల్లా కలెక్టర్కు ఆర్డిఓకు వివరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చదవండి: