ETV Bharat / state

నెల్లూరులో భారీ వర్షం.. జన జీవనం అస్తవ్యస్తం - మర్రిపాడు మండలంలో ....

నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతలు నీటమునగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

heavy-rain-in-nellore
నెల్లూరులో భారీ వర్షం
author img

By

Published : Nov 15, 2020, 6:16 PM IST

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కేశవనగర్ ప్రాంతంలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. వేదాయపాళెం, ఎస్పీ కార్యాలయం, కేవీఆర్ పెట్రోల్ బంకు సెంటర్, సుబేదారుపేట, వాహబ్ పేట ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

heavy-rain-in-nellore
నెల్లూరులో భారీ వర్షం

మర్రిపాడు మండలంలో ....

వర్షం కారణంగా మర్రిపాడు మండలంలో మొక్కజొన్న, మిరప పంటలు నీటిపాలయ్యాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మిరప పంట పూత, పిందె రాలిపోయింది. వర్షం ఇలానే కొనసాగితే మొక్కజొన్న మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

heavy-rain-in-nellore
నెల్లూరులో భారీ వర్షం

నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో..

నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలు నీటితో నిండాయి. మిరప, కూరగాయలు, తోటలు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. స్వర్ణముఖి నది, పెళ్లకూరు మండలం పెన్నేపల్లి కలుజు ఉద్ధృతంగా పారుతున్నాయి. మోటార్లు మునిగి పోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

చెరువుల పరిస్థితి

నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురవడంతో నగర శివారు కాలనీల్లోకి నీరు చేరింది. కోవూరు, బుచ్చిరెడ్డిపాలె, కావలి, గూడూరు ప్రాంతాల్లో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

పెరిగిన భూగర్భజలం.. అన్నదాతల్లో వెల్లివిరిసిన ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.