ETV Bharat / state

గాలివాన భీభత్సం.. భారీగా పంట నష్టం - mirchi crop lost in nellore dist

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో కురిసిన గాలివానకు.. వందల ఎకరాల్లో బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. మిర్చి పంటలు కొట్టుకుపోయాయి.

Heavy crop damage and stalled power supply in Nellore district
నెల్లూరు జిల్లాలో గాలివానతో భారీగా పంట నష్టం, నిలిచిన విద్యుత్ సరఫరా
author img

By

Published : May 20, 2020, 9:30 AM IST

నెల్లూరు జిల్లాలో మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో ఒక్కసారిగా తీవ్ర గాలి, వర్షం కురిసిన కారణంగా.. అప్పటికే కోతకు వచ్చిన పంటలను రైతులు నష్టపోయారు. మర్రిపాడు, పి.నాయిడు పల్లి, కదిరినాయుడు పల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో బొప్పాయి చెట్లు విరిగిపోయాయి.

చుంచులూరు, కొత్తపల్లి గ్రామాల్లో అంతర పంటగా వేసిన వెరుశెనగ.. నీట మునిగిపోయింది. అనంతసాగరం మండలం అగ్రహరం, బొమ్మవరం, చాపురాళ్ళపల్లి, వడ్డిపల్లి గ్రామాల్లో మిర్చి పంట కొట్టుకుపోయింది. గాలి వాన ధాటికి ఇళ్లు పడిపోగా.. అగ్రహరం గ్రామంలో గోడ కూలి 5 మేకలు చనిపోయాయి. విద్యుత్ సరఫరాకూ ఆటంకం కలిగింది. స్తంభాలు కూలిన కారణంగా.. 2 గ్రామాల్లో అంధకారం నెలకొంది.

ఇదీ చదవండి:

వలస కార్మికులకు సోమిరెడ్డి ఆర్థిక సాయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.