ETV Bharat / state

దగదర్తి విమానాశ్రయం తరలించేలా ప్రభుత్వం పావులు..

GOVT TRY TO MOVE DAGADARTHI AIRPORT : నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయాన్ని మరో ప్రాంతానికి తరలించేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఆమేరకు భూసేకరణ చేపట్టిన సర్కారు.. డీపీఆర్‌ సిద్ధం చేసే బాధ్యతను ఓ సంస్థకు అప్పగించింది. ‘కొత్త విమానాశ్రయం రామాయపట్నం పోర్టుకు సమీపంలో వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

GOVT TRY TO MOVE DAGADARTHI AIRPORT
GOVT TRY TO MOVE DAGADARTHI AIRPORT
author img

By

Published : Nov 7, 2022, 8:17 AM IST

దగదర్తి విమానాశ్రయం తరలించేలా ప్రభుత్వం పావులు

DAGADARTHI AIRPORT : గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆపేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయం కూడా చేరింది. దీనికోసం అప్పటి తెదేపా ప్రభుత్వం భూ సేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినా.. అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా విమానాశ్రయాన్ని తరలించాలని నిర్ణయించింది. తెట్టు దగ్గర కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికోసం సుమారు 2వేలకు పైగా ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో కొంతమేర అటవీ భూములున్నాయి. వీటిని సేకరించడానికి కేంద్ర అనుమతి కోసం ప్రతిపాదన పంపింది.

అనుమతులు రావడానికి.. భూసేకరణ పూర్తి చేయడానికి.. పౌర విమానయాన సంస్థ నుంచి సమాధానం రావడానికి కనీసం ఏడాదికి పైగా పడుతుందని అధికారుల అంచనా. దగదర్తి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై కోర్టు వివాదాలు పరిష్కారం కావడానికి ఏళ్ల సమయం పట్టింది. ఇదే తీరులో ప్రస్తుతం విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటనే దానిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దగదర్తి దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనను ...వైకాపా ప్రభుత్వం ఉపసంహరించింది. ఇప్పటికే సేకరించిన 13వందల 15 ఎకరాల భూములను సర్కారు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

తెట్టు వద్ద విమానాశ్రయాన్ని పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసే బాధ్యతలను AP అర్బన్‌కు అప్పగించింది. ఈ సంస్థ 3 నెలల్లో డీపీఆర్‌ను అందిస్తుందని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. ‘కొత్తగా ప్రతిపాదించిన ప్రదేశం రామాయపట్నం పోర్టుకు సమీపంలో ఉంటుందని వెల్లడించారు. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పోర్టు, విమానాశ్రయం వల్ల పారిశ్రామికాభివృద్ధికి అవకాశం ఉంటుందని భావిస్తున్నామన్నారు. సరకు రవాణాలో ఈ ప్రాంతం కీలకంగా మారుతుంది’వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.