రైతుల నుంచి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. కర్షకులను మిల్లర్లు ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. నెల్లూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కార్యాలయంలో సోమవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకూడదని స్పష్టం చేశారు.
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. రైతులు ఈ కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి
మళ్లీ ఇరగదీనిన నెల్లూరు కుర్రాళ్లు... పవర్ స్టార్ పుట్టినరోజుకు ప్రత్యేక కానుక