నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రభుత్వ వైద్యులకు, వైద్య సిబ్బందికి పట్టణంలోని ప్రైవేటు వైద్యులు కళాధర్ భోజనాలను అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న సిబ్బందిని అభినందిస్తూ ఆయన తోడ్పాటును ఇచ్చారు.
పట్టణంలోని బంగారుపేట, జీకేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం సిబ్బందికి, వైద్యులకు బిర్యానీ పొట్లాలు, పెరుగన్నం అందించారు. ప్రజలు భౌతిక దూరం పాటించి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కంకణబద్ధులై కావాలని డాక్టర్ కళాధర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: