నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. పెన్నానదికి ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఆగని పరిస్థితుల్లో నెల్లూరులో అనేక కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. పుత్తా ఎస్టేట్, మనుమసిద్ది నగర్, పొర్లుకట్ట ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లోకి ఆరుడుగలపైన నీరు నిలిచింది.
వందలాది ఇళ్లు నీట మునిగాయి. బాధిత ప్రజలను అధికారులు, స్థానిక యువత ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కొందరు మిద్దెల మీదికి చేరి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇళ్లలోని సామగ్రి తడిచి పోగా, వాహనాలు నీటిలోనే తేలియాడుతూ పాడైపోతున్నాయి.
ఇదీ చదవండి:
నెల్లూరు జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గౌతమ్ రెడ్డి