నెల్లూరు జిల్లా అనుమ సముద్రం పేట మండలం కొండమీద కొండూరు గ్రామ సమీపంలోని తిప్ప కొండపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగసి పడుతూ కొండ చుట్టూ వ్యాపించడంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే సమీపంలో భారీగా ధాన్యం రాశులు ఉండడంతో.. ధాన్యం అగ్నికి ఆహుతి అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందారు.
అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు చాకచక్యంగా వ్యవహరించి సకాలంలో మంటలు అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేవారు లేక తిప్పపై రాసులుగా పోసుకున్నామని.. అగ్నిమాపక యంత్రం సకాలంలో రాకపోతే ధాన్యం భారీగా నష్టపోయేవారమని అన్నారు.
ఇదీ చదవండి:
నెల్లూరులో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ప్రశ్నపత్రం లీక్