పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఇండియన్ బ్యాంకు వద్ద ఖాతాదారులు బారులు తీరారు. బ్యాంకులో బంగారు ఆభరణాలపై రుణాలు పొందిన వారికి రెన్యూవల్ చేయడంతో భారీ సంఖ్యలో చేరుకున్నారు. భౌతిక దూరం పాటించలేదు. ఒకరిపై ఒకరు పడుతూ కనిపించారు.
కరోనా విజృంభించి కేసులు పెరుగుతున్న సమయంలో స్వీయ నియంత్రణ లేకుండా బారులు తీరడం, అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: 'కక్షపూరిత రాజకీయాలతో సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారు'