ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బీమాను రైతులు చెల్లిస్తుంటారు. రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా.. వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంతో వైకాపా ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీంతో రైతులకు మేలు జరుగుతుంది.
నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ 2018-19 సంవత్సరంలో జిల్లాలో కరువుతో పంట నష్టపోయిన 13,649 రైతులకు 22 కోట్ల 42 లక్షల రూపాయలు నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పంటల బీమా ఎంతో అవసరం. - ఆనంద కుమారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, నెల్లూరు
2019-20 రబీ నుండి రైతులు ఏ విధమైన నగదు చెల్లించకుండా ఈ కర్షక్ యాప్లో పంట నమోదు చేయించుకుని.. ప్రతి రైతుకు పంటల బీమా పథకం వర్తింపు అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
ప్రతికూల వాతావరణం కారణంగా రైతులు పంట పండించకపోవడం జరుగుతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతారు. ఈ విధంగా నష్టపోయిన రైతులకు బీమా కంపెనీ 25% నష్టపరిహారం చెల్లిస్తుంది. రైతు భరోసా కేంద్రంలో ప్రతి రైతు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి పంట పరిస్థితులను ఈ కర్షక్ లో నమోదు చేసుకోవాలి- అనిత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, నెల్లూరు జిల్లా
ప్రభుత్వమే పంటల బీమాను చెల్లించడంతో తమకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు