నెల్లూరు జిల్లా పెళ్ళకూరు వద్ద వైకాపా కార్యకర్తలు మాజీ మంత్రి, తెదేపా నాయకుడు పరసారత్నం కారుపై దాడి చేశారు. తాళ్వాయిపాడు తెదేపా ఎంపీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన నాగభూషణమ్మ వర్గీయుల నుంచి వైకాపా కార్యకర్తలు దౌర్జన్యంగా నామినేషన్ కాగితాలు లాక్కున్నారు. భయపడిన తెదేపా అభ్యర్ధి నామినేషన్ పత్రాలు ఇవ్వకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పరసారత్నం.. అభ్యర్ధి ఇంటికి వెళ్లి నాగభూషణమ్మ, లెనిన్ కుమార్ తోపాటు మరో ఇద్దరితో కలసి నామినేషన్ వేసేందుకు కారులో పెళ్లకూరు బయలు దేరారు. మార్గ మధ్యలో మాటువేసిన వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా కారుపై దాడి చేశారు. దాటిలో ఎవరికీ గాయాలు కానప్పటికీ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నాయుడుపేట నుంచి పోలీసులు రావడంతో అల్లరిమూకలు పరారు అయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పరసారత్నం నాయుడుపేటలో కొద్దిసేపు బైఠాయించి, అనంతరం పోలీసుస్టేషన్లో కూర్చొని నిరసన తెలిపారు.
ఇవీ చూడండి...