ETV Bharat / state

'సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాస్వామ్య హక్కులు లేవు'

author img

By

Published : Feb 19, 2021, 10:40 PM IST

పోలీసుల తీరుపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా మారి గిరిజనులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అమ్మఒడి పథకం రానివ్వం అని ఎస్సై బెదిరించే పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Ex Minister Somireddy Fires on Police over Panchayat elections

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాస్వామ్య హక్కులు లేవని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి గిరిజనులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గత రెండేళ్లలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. ప్రభుత్వ పథకాల అమలు తప్ప సర్వేపల్లిలో మరేం చేయలేదని ధ్వజమెత్తారు. పింఛన్లు ఆపేస్తాం.. ఇళ్ల పట్టాలు రానీయమని పోలీసులు బెదిరిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. అమ్మఒడి పథకం రానివ్వం అని ఎస్సై బెదిరించే పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని... సర్పంచులు, వార్డు సభ్యులుగా మంచి అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు.

ఇదీ చదవండీ... నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం సమాప్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.