ETV Bharat / state

కల్తీ నెయ్యిని చిటికెలో కనిపెట్టేయొచ్చు - ఈ చిట్కాను పాటిస్తే సరి! - Ghee Purity Test At Home

How to Check Ghee Quality in Telugu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం కలుగుతుంది. బయట దుకాణాల్లో కొనే నెయ్యి మంచిదా? కాదా?. అయితే నెయ్యి స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలా అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ghee purity test at home
ghee purity test at home (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 10:20 PM IST

Updated : Sep 21, 2024, 10:25 PM IST

How to Check Ghee Quality in Telugu: పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పడు ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం కలుగుతుంది. బయట దుకాణాల్లో కొనే నెయ్యి మంచిదా కాదా అని. అయితే నెయ్యి స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలా చాలా మందికి తెలియదు. రోజుకి రెండుమూడు స్పూన్లు నెయ్యి తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ, పిల్లలకీ వృద్ధులకీ నెయ్యి మంచిదనీ, నేతితో వండిన అన్నం పిల్లలకు మేలనీ అంటారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేదెలా. ఇప్పడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Ghee Purity Test At Home: దేశీ నెయ్యిలో పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలూ చాలా ఉంటాయి. దీని వల్ల రుచితో పాటు ఆరోగ్యమూ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేదెలా అంటే..

  • నీళ్లతో పరీక్ష: గ్లాసు నీటిలో చెంచా నెయ్యి వేయండి. నెయ్యి నీళ్లపై తేలితే అది స్వచ్ఛమైంది. అదే అడుగుకు చేరితే కల్తీ అని నిర్ధారణ చేసుకోవచ్చు.
  • వేడి చేయడం: పాన్‌లో రెండు మూడు చెంచాల నెయ్యి వేసి కొంచెెం సేపు వేడి చేయాలి. ఆ తర్వాత ఓ రోజంతా దాన్ని అలా వదిలేయాలి. తరువాత రోజు అది చిన్న చిన్న రేణువుల్లా మారి సువాసనలు వెదజల్లుతుంటే స్వచ్ఛమైందేనని ముద్దలానే ఉంటే కల్తీ అని తెలుసుకోవచ్చు.
  • ఉప్పుతో: 2 చెంచాల నెయ్యిలో అర చెంచా ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత నెయ్యి రంగు మారితే అది కల్తీ అనే అర్థం.

ఇలా కూడా కనిపెట్టొచ్చు..

  • కాస్త నెయ్యిని అరచేతిలో వేసుకోండి. కాసేపటికి అది కరిగితే నాణ్యమైందని అర్థం.
  • చెంచా నెయ్యిని పాన్‌లో వేసి వేడి చేయాలి. వెంటనే కరిగి ముదురు చాక్లెట్‌ రంగులోకి మారితే అది స్వచ్ఛమైంది. కరగడానికి ఎక్కువ సమయం పట్టి, లేత పసుపు రంగులోకి మారితే మాత్రం తేడా ఉన్నట్టు.

ఆవు నెయ్యి శ్రేష్ఠమైనది: ఆవు, గేదె, మేక పాల నుంచి నెయ్యి తీసినప్పటికీ ఆవు నెయ్యి శ్రేష్ఠమైనది అంటోంది ఆయుర్వేదం. ఆవునెయ్యిలో బీటా-కెరోటిన్‌ ఎక్కువగా ఉండటంతో పసుపు రంగులో ఉంటుంది. గేదె నెయ్యి తెల్లగా రుచిగా ఉంటుంది. కానీ ఆవునెయ్యిలో కొవ్వు శాతం తక్కువ కావడంతోపాటు, జీవక్రియను పెంచి బరువును తగ్గించే కాంజ్యుగేటెడ్‌ లినోలియాక్‌ ఆమ్ల శాతం ఎక్కువ. అయితే ఈ ఆమ్లం గడ్డి మేసే పశువుల పాలల్లోనే అధికంగా ఉంటుందట. అందుకే పశువులకు వేసే మేతను బట్టి గ్రాస్‌-ఫెడ్‌, ఎ2 ఆర్గానిక్‌ గ్రాస్‌ ఫెడ్‌, గ్రెయిన్‌-ఫెడ్‌, గార్లిక్‌గ్రాస్‌-ఫెడ్‌.. ఇలా రకరకాల పేర్లతో సేంద్రియ మంత్రాన్ని చేర్చి మరీ నెయ్యిని విక్రయిస్తున్నాయి కంపెనీలు.

రోగనిరోధకశక్తి పెరుగుతుంది: గిర్‌, సాహివాల్‌, వేచూరు వంటి దేశవాళీ ఆవుల్లో ఎ2 రకం బీటా కేసిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. అదే హైబ్రిడ్‌ జాతి ఆవుల్లో ఎ2 కన్నా ఎ1 రకం బీటా కేసిన్‌ ఎక్కువ. ఎ1తో పోలిస్తే ఎ2 మంచిదట. దీని ధర కూడా ఎక్కువే. కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల గేదె నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కానీ దానివల్ల బరువు పెరుగుతారు. ఆవునెయ్యిని అన్ని వయసులవాళ్లూ తినొచ్చు. కానీ గేదె నెయ్యి ఆరోగ్యంగా చురుకుగా ఉన్నవాళ్లకే మంచిదట. పిల్లలకు కూడా ఆవు నెయ్యి పెట్టడంవల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది అంటారు ఆయుర్వేద వైద్యులు.

తిరుమల లడ్డూకు మళ్లీ నందిని సువాసన! - కిలో నెయ్యి రూ.478 - NANDINI GHEE TO TIRUMALA LADDU

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB - ల్యాబ్‌ రిపోర్ట్‌లో భయంకర నిజాలు - TTD GHEE ISSUE FACTS

Last Updated : Sep 21, 2024, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.