ETV Bharat / state

'తిరుపతి ఉప ఎన్నికలో హస్తం గుర్తుకే ఓటు వేయండి' - నెల్లూరులో మాజీ మంత్రి చింతామోహన్ పర్యటన

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఎన్నికల ప్రచారం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.

ex minister chinta mohann
హస్తం గుర్తుకే ఓటు వేయండి
author img

By

Published : Mar 17, 2021, 5:02 PM IST

రాష్ట్రలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని.. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలపై విరమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక పరిధిలో పర్యటించిన ఆయన తిరుపతి ఉప ఎన్నికలో హస్తం గుర్తుకు ఓటేయాలని సూచించారు. త్వరలో కాంగ్రెస్​కు మంచి రోజులు రావడం తథ్యమన్నారు.

రాజధాని భూముల పేరుతో మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలని హితవుపలికారు. భవిష్యత్తులో తిరుపతి, వెంకటగిరి, నాయుడుపేట ప్రాంతాలు.. రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతం అవుతుందని అన్నారు.

ఇదీ చూడండి:

సీఎం జగన్​కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలి: హర్ష కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.