గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విశాఖ జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గ౦లోని పలు గ్రామాల్లో పర్యటించి ఇసుక అక్రమ రవాణా నిరోధించడానికి స్థానిక అధికారులు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ పరిశీలించారు. నక్కపల్లి ఇసుక పాయి౦ట్ ను తనిఖీ చేశారు. నిల్వలపై ఆరా తీశారు. చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సిబ్బందికి సూచించారు.
ఇదీ చూడండి