భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 48వేల కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్లు సమకూర్చాలని కేంద్ర కేబినేట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుందని డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి దోహదపడుతుందని అన్నారు. సొంత గ్రామం నెల్లూరు జిల్లా మహిమలూరులో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సతీశ్ రెడ్డి రానున్న రోజుల్లో భారత వైమానిక దళంలో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి