పారిశుద్ధ్య కార్మికులకు దాతల సాయం - నెల్లూరు జిల్లా వార్తలు
నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి దాతలు కూరగాయలు, రొట్టెలు నీరు అందించారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన సొరకాయలను పంపిణీ చేశారు. పట్టణంలోని 2వేల కుటుంబాలకు 786 సేవా సంస్థ ఆధ్వర్యంలో పాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. పలువురు మజ్జిగ, పెరుగన్నం, పులిహోర పేదలకు పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా మాస్క్లు అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేస్తున్న వారికి నాయుడుపేట కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.
donors donated Essential commodities to Sanitary workers