నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బనగానపల్లె పంచాయతీ పరిధిలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్లూరి రవీంద్రారెడ్డి రూ. 5 లక్షల విలువ చేసే నిత్యావసర సరకులు వితరణ చేశారు. పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలకు వాటిని అందించారు.
ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, సరకులు, కూరగాయలు అందించారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని.. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సహాయం అందజేశానన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు.
ఇవీ చదవండి: