ETV Bharat / state

ప్రతికూల పరిస్థితుల్లోనూ.. మొక్కవోని ధైర్యంతో ముందడుగు

Disabled person: చేతులు లెేకపోతేనేం.. రెండు కాళ్లు ఉన్నాయి కదా అనుకున్నాడు ఆ యువకుడు. అద్భుతాలు సృష్టించకపోయినా.. ఆత్మవిశ్వాసంతో ఎవరి సహాయం తీసుకోకుండా తనకు తానుగా జీవిస్తున్నాడు. దివ్యాంగుడిని అనే బాధను దరి చేరనీయకుండా.. చిన్నా చితక పనులు చేసుకుంటున్నాడు. అయితే ఇంతటి మనోనిబ్బరంతో బతుకున్న వ్యక్తికి కరోనాతో ఇబ్బందులు వచ్చిపడ్డాయి. పనులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వ సాయం చేస్తే సొంతంగా వ్యాపారం చేస్తానంటున్నాడు మల్లిఖార్జున.

Disabled person Nellore
నెల్లూరు దివ్యాంగుడు
author img

By

Published : Oct 25, 2022, 7:14 PM IST

రెండు చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్న మల్లికార్జున

Disabled person: పుట్టుకతోనే వైకల్యం వెంటాడినా ఆ యువకుడు వెరవలేదు. చేతులు లేకపోయినా.. దేవుడు రెండు కాళ్లూ ఇచ్చాడు కదా అనే ఆత్మవిశ్వాసం అతని సొంతం. జీవితంలో అద్భుతాలు సాధించకపోయినా.. ప్రతికూల పరిస్థితులకు భయపడకుండా ఎదురొడ్డి నిలవాలనే సందేశాన్ని అందిస్తున్నాడు. చదువుకోకపోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.

నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం కాలనీకి చెందిన రమణమ్మ, శేషారెడ్డిల కుమారుడు మల్లిఖార్జున. పుట్టుకతోనే దివ్యాంగుడు. రెండు చేతులూ లేవు. చిన్నతనంలోనే తండ్రి శేషారెడ్డి మృతి చెందాడు. ఇల్లు కూడా లేదు. ఆర్థిక పరిస్థితులూ అంతంతమాత్రమే. పుట్టిన బిడ్డ దివ్యాంగుడు కావడంతో తల్లి తొలుత కుంగిపోయింది. ఆపై తేరుకొని, నిరుత్సాహ పడకుండా కూలి పనులు చేసి.. మల్లికార్జునను పెద్దవాడ్ని చేసింది. చదివించలేకపోయినా.. కుమారుడికి కాళ్లనే చేతులుగా మార్చింది. మల్లికార్జున ఏ పనైనా చక్కగా చేస్తాడంటున్న తల్లి రమణమ్మ.. తన వంతు సాయం చేస్తానని చెబుతోంది.

"అబ్బాయి పుట్టటమే దివ్యాంగునిలాగా పుట్టాడు. మాకు జీవనాధారం ఏదీ లేదు. పింఛను డబ్బులతో చిన్నచిన్న పనులు చేసి పోషించాను. అబ్బాయి పనులు అబ్బాయి చేసుకోగల్గుతున్నాడు". - రమణమ్మ, మల్లికార్జున తల్లి

దివ్యాంగుడైన మల్లికార్జున కాళ్ల సాయంతోనే అన్ని పనులూ చేసుకుంటున్నాడు. తల్లికి భారం కాకుండా తన పనులు తాను చక్కబెట్టుకుంటాడు. తల్లికి చేదోడుగా ఉండాలని.. 15ఏళ్ల వయసులోనే రిక్షా నడిపాడు. ఆటో, ట్రాక్టర్‌ నడపడం నేర్చుకున్నాడు. పాత ఎలక్ట్రికల్ వస్తువులను కొనడం, అమ్మడం చేస్తున్నాడు. వచ్చిన సంపాదనతో చిన్న ఇల్లు కట్టుకున్నారు. అయితే కరోనాతో ఆర్థికంగా కొంత ఇబ్బందులు తప్పలేదు. పాత వస్తువులు కొనేవారు తగ్గారు. ప్రభుత్వం సాయం చేస్తే ఎలక్ట్రికల్ వస్తువుల విక్రయ వ్యాపారం ప్రారంభించేందుకు సిద్ధమని మల్లికార్జున చెబుతున్నాడు. దివ్యాంగులు ధైర్యంగా ముందడుగు వేయాలంటున్న మల్లికార్జున.. కష్టాలను చూసి భయపడకూడదంటున్నాడు.

"నేను పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా పుట్టాను. ప్రతి పని కాళ్లతోనే చేసుకుంటాను. ఆటో, ట్రాక్టర్​ నడపగలను. చాలా వరకు కష్టపడుతూ.. పాత ఎలక్ట్రిక్​ వస్తువులను అమ్మటం, కొనటం చేస్తూ వచ్చిన ఆదాయం జీవనం సాగిస్తున్నాను. వాహనాలు నడపటం అనేది.. అందరూ నడుపుతున్నారు కదా! నేను ఎందుకు నడపకూడదనే ధైర్యంతో నేర్చుకున్నాను. చాలా వరకు దివ్యాంగులు ధైర్యం కొల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కాదు జీవితం.. మన కాళ్ల మీద మనం సొంతంగా బతికి మనం ఎంటో నిరూపించాలి. స్వయం కృషిగా జీవించాలి". -మల్లికార్జున , నెల్లూరు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.