ETV Bharat / state

నెల్లూరులో దారుణం.. అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత.. బాధితుల ఆందోళన - Demolition of houses at midnight in Nellore

Demolition Of House : "కూలి చేసుకోని బతికేవాళ్లం.. మొన్నటి దాకా బాగాలేక చచ్చి బతికాను. మాకు ఇళ్లు వాకిలి లేకుండా ఎక్కడికి పోవాలి.. ఎక్కడ బతకాలా? చెప్పండి... రోడ్డు మీద పడుకుంటాం.. మా మీద ఎక్కించండి బండి. చచ్చిపోతాం.. అప్పుడు కట్టుకోండి" అంటూ 60 ఏళ్లకు పైబడిన ఓ మహిళ కన్నీటి ఆవేదన. నెల్లూరులో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇళ్లు కూల్చి వేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇదంతా మాజీ మంత్రి తన అనుచరుడి కోసం చేశారనీ బాధితులు ఆరోపిస్తున్నారు.

Demolition of houses at midnight
అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత
author img

By

Published : Mar 29, 2023, 2:09 PM IST

Demolition Of House : గత 40 సంవత్సరాలుగా వాళ్లు అక్కడే జీవిస్తున్నారు.. కూలీ, నాలీ చేసి.. కడుపు మాడ్చుకుని.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని వాళ్లు ఇళ్లు కట్టుకున్నారు. కానీ అధికార పార్టీ నాయకుడు తన అనుచరుడి కోసం రాత్రికి రాత్రే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇళ్లను నేలమట్టం చేయించాడు. వాళ్లందరూ మేము ఈ ఆర్ధరాత్రి ఎక్కడికి పోవాలని లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఈ తతంగం అంతా నెల్లూరు జిల్లాలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కనుసన్నలలో జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

నెల్లూరులో అర్ధరాత్రి నాలుగు ఇళ్లను కూల్చి వేశారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాముర్తినగర్​లో 40 ఏళ్లుగా ఉంటున్నామని,.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరుడి కోసం తమ ఇల్లు కూల్చి వేశారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 40 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లకు ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కూడా కార్పొరేషన్​కు చెల్లిస్తున్నామని, అర్ధరాత్రి అధికారుల అండతో ప్రొక్లెయినర్​తో కూల్చి వేశారని, దీంతో రోడ్డున పడ్డామని నాలుగు కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కోల్పోవడం వల్ల వృద్దులు, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడి కోసం తమ ఇళ్లు కూల్చి వేశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. బాధితులకు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, మహిళా సంఘాలు నాయకులు అండగా నిలిచారు.

నెల్లూరులో దారుణం.. అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత.. బాధితుల ఆందోళన

"కూలి చేసుకుని బతికేవాళ్లం.. మొన్నటి దాకా బాగాలేక చచ్చి బతికాను నేను. మాకు ఇళ్లు వాకిలి లేకుండా ఎక్కడికి పోవాలి. ఎక్కడ బతకాలా? చెప్పండి... పడుకుంటాం మా మీద ఎక్కించండి బండి.. చచ్చి పోతాం. అప్పుడు శుభ్రంగా కట్టుకోని అక్కడే ఉండండీ. ఏమీ న్యాయం సార్ ఇదీ. ఇళ్లకు పట్టాలు కూడా ఇచ్చాడు రమేష్ రెడ్డి. ఇంటి పన్ను కట్టుకుంటున్నాము. ఇప్పటికిప్పుడు వచ్చి పొమ్మంటే ఎక్కడికి పోయి బతకాలి. ఎక్కడికి పోయి ఉండాలి. తిండితిప్పలు లేకుండా ఉన్నాము ఉదయం నుంచి." - వృద్ద బాధితురాలు

" కార్పొరేటర్ గారికి రోడ్డు అవసరం అనేసి ఉన్న ఫలంగా మూడు ఇళ్లు లేపేయాలని, వెనక నాలుగు ఇళ్లు అని చెప్పారు. మాకు ఫలానా రోజు పగలగొడతామని మాకు నోటీసులు ఇవ్వలేదు. వెంకటేశ్వరపురంలో పట్టాలిస్తామన్నారు. మాకు అక్కడ వద్దు అని చెప్పాము. ఎమ్మెల్యే గారు సుగర్ ఫ్యాక్టరీ వెంబడి కట్టించి, అక్కడికి పంపించి ఇళ్లు కూలుస్తామని చెప్పారు. అది లేదు. చెప్పిన మాట ప్రకారం ఇచ్చేస్తే మేమే వెళ్లిపోతాం. ఇంత తతంగం చేయాల్సిన అవసరం లేదు. మేమే చెప్పాము కదా. ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని, అసలు ఏమీ లేకుండానే ఉన్నఫలంగా తోసేస్తే మేము ఎక్కడ ఉండాలి. ముందు అడ్డం పడుతున్నామని వెనక నుంచి తోసేశారు. " - బాధితురాలు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.