Dance Therapy Exercises: నెల్లూరు నగర పాలక సంస్థలో 1500మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. రోజూ రోడ్లు ఊడ్చి అలసిపోతున్నారు. వీరిలో నూతన ఉత్తేజాన్ని కలిగించేందుకు నగర పాలక సంస్థ కమిషనర్ ఓ ప్రయత్నం చేశారు. తెల్లవారు జామున 5.30నిమిషాలకు మస్తర్లు వేసుకుని పనికి వెళ్తారు. ఆసమయంలో 30నిమిషాలు వీరితో అధికారులు గడుపుతారు. సరదాగా ఏరో బిక్స్ నేర్పిస్తున్నారు. జుంబా డ్యాన్స్ వేయిస్తారు. బ్రీతింగ్ ఎక్సైర్ సైజ్ చేయిస్తున్నారు. నెల రోజులుగా నెల్లూరు నగరంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాలువలు శుభ్రం చేసి, రోడ్లూ ఊడ్డి విసుగుతో ఉంటున్న వీరికి ఈ 30నిమిషాల కార్యక్రమం ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుందని వారు అంటున్నారు.
జుంబా డ్యాన్స్ నేర్పించేందుకు ప్రత్యేక నిపుణులు...
కొవిడ్ తరువాత ఇటువంటి ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. నెల రోజులుగా డివిజన్లు వారిగా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి డ్యాన్స్ థెరపి ఎక్సైర్ సైజ్లు చేయిస్తున్నారు. మహిళలు కూడా ఎంతో బాగుందని అంటున్నారు. దుమ్మూధూళి పీల్చి.. టీబీ వంటి వ్యాధులతో బాదపడుతున్నారు. వీరికి ఆరోగ్యంపై కొంత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్సైర్ సైజ్ వల్ల శరీర భాగాలు అన్నికదులుతు పని వత్తిడి తగ్గుతుందని అంటున్నారు. జుంబా డ్యాన్స్ నేల్పించేందుకు ప్రత్యేక నిపుణులు ఉన్నారు. నెల రోజులుగా వీరి పనితీరు మారిందని అధికారులు అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అంటున్నారు. రాజస్థాన్ నుంచి యోగాపై ప్రత్యేక శిక్షకులను పిలిపించారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏడాది పొడవునా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి డివిజన్ లో ఒక అధికారులు ఈ కార్యక్రమంపై శిక్షణ పొందుతున్నాడని చెబుతున్నారు. నగర ఆరోగ్యాన్ని కాపాడే సిబ్బంది కోసం ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
అప్పుడు పెగాసస్ కొనలేదు.. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: ఏబీవీ