నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగు పొంగి పొలాలు నీట మునిగాయి. పెన్నానదికి సోమశిల నుంచి భారీగా వరద రావడంతో సమీప పంటలు జలమయమయ్యాయి. కోతకొచ్చిన వరిని యంత్రాల ద్వారా కోయలేని పరిస్థితి ఏర్పడింది. కూలీల సహాయంతో రైతులు ధాన్యాన్ని పడవల్లో బయటకు తెచ్చి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.
పది రోజుల వ్యవధిలో రెండు సార్లు వరద రావడంతో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నీటమునిగిందని రైతులు బాధ పడుతున్నారు. అప్పులతో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట.. కోత సమయానికి గంగపాలైందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: