ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నెల్లూరు జిల్లాలో వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు నరసోజిరావు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల్లో 2482 హెక్టార్లలో వరి, 46 హెక్టార్లలో వేరుశనగ దెబ్బతిన్నాయన్నారు.
గ్రామ వ్యవసాయ సహాయకులను..
మరోవైపు పెన్నానది ఉద్ధృత ప్రవాహంతో ఐదు మండలాల్లోని 19 గ్రామాల్లో 1426 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని పేర్కొన్నారు. పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మొత్తం మీద సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు వివరించారు. పంట నష్టం జరిగి పేరు నమోదు చేయించుకోపోతే రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ గ్రామ సహాయకులను సంప్రదించాలని నరసోజిరావు సూచించారు.