కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. సరైన సౌకర్యాలు లేక ఆసుపత్రుల్లోనూ వైద్యం సక్రమంగా అందడం లేదన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలందరి సహకారం అవసరమని ఆయన నెల్లూరులో అన్నారు.
కొవిడ్‌తో మృతిచెందినవారి అంత్యక్రియలు నిర్వహించేందుకు పట్టణ సీపీఎం కార్యకర్తలు ముందుకు వచ్చారన్నారు. అందుకోసం కలెక్టర్ అనుమతి కోరుతూ లేఖ రాశామని తెలిపారు. అవసరమైతే ఆసుపత్రుల్లోనూ సేవలందించేందుకు తమ కార్యకర్తలు సిద్ధమని స్పష్టం చేశారు. కేరళ మాదిరిగా మన రాష్ట్రంలోనూ స్వచ్ఛంద సేవకుల సహకారం తీసుకోవాలని సూచించారు. కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రూ. 7500 ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఇవీ చదవండి..