పెన్నా వరద నుంచి రక్షణ నిర్మాణం పేరిట.. నెల్లూరు నగరంలో వందల కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఆయన ఈరోజు పర్యటించారు.
ముంపు నుంచి కాపాడేందుకు రక్షణ నిర్మాణం కోసం.. అవసరమైన స్థలానికే మార్కింగ్ చేయాలని మధు డిమాండ్ చేశారు. వరద సాయం నేటికీ అందించకపోవడం దారుణమన్నారు. పేద కుటుంబాలను వీధి పాలు చేసే చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోమని, పోరాడుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: