ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: నిమ్మ రైతులకు తీవ్ర నష్టం - నిమ్మ రైతులకు తీవ్రనష్టం

కరోనా దెబ్బ నిమ్మరైతులపైనా పడింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక నిమ్మకాయలను కోయకుండా అలానే చెట్లకు వదిలేస్తున్నారు. పంట కోసం... బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కనీసం వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

corona effect
corona effect
author img

By

Published : Jun 9, 2020, 7:26 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో సుమారు 4వేల హెక్టార్లలో నిమ్మసాగు చేస్తున్నారు. ఆసియాలోనే గూడూరు ప్రాంతంలోని నిమ్మకు.. మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి మార్కెట్ నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. ఇప్పుడు కరోనాతో పరిస్థితి మారిపోయింది. ఎప్పుడూ లేని విధంగా భారీగా ధర పడిపోయింది. వ్యాపారస్తులు, రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాలను ఎదుర్కుంటున్నారు.

ప్రస్తుతం నిమ్మ బస్తా ధర 500 నుంచి 1300 రూపాయల వరకు పలుకుతోంది. గత ఏడాది ఇదే సమయానికి బస్తా ధర 4వేల నుంచి 5వేల రూపాయలు పలికింది. ప్రస్తుతం రైతులకు కూలీ డబ్బులు గిట్టుబాటు కాకపోవడంతో తీవ్ర నష్టాల్లో ఉన్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు నిమ్మకాయలను కోయకుండా అలాగే చెట్లకు వదిలేస్తున్నారు.

నిమ్మ పంటను గూడూరు,సైదాపురం, పొదలకురు, డక్కిలి, బాలయపల్లి, రాపురు మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. పంటకు సుమారుగా ఎకరాకు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కూలీ ఖర్చులు రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

లాక్​డౌన్ కారణంగా దిల్లీ, మహారాష్ట్ర వంటి పట్టణాల్లో మార్కెట్లు మూసేసిన కారణంగా... నిమ్మ వ్యాపారులకు గిట్టుబాటు ధరలు రావడం లేదని.. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని రైతులు చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కనీసం వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

బార్లు తెరిచేందుకు అనుమతి నిరాకరణ..కానీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.