ETV Bharat / state

‘కోయంబేడు’ లింకులతో రోజురోజుకూ కేసుల పెరుగుదల - నెల్లూరులో కరోనా వార్తలు

నెల్లూరు జిల్లాలో శరవేగంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. 60 రోజుల వ్యవధిలో 100 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు 6 రోజుల్లోపే అందులో సగానికి చేరువ కావడం కలకలం రేపుతోంది. ప్రధానంగా సూళ్లూరుపేటపైనే తీవ్ర ప్రభావం చూపుతుండగా.. పరిసర ప్రాంతాల్లోనూ కలవరం రేపుతుండటం గమనార్హం. ఓ వైపు షార్‌, మరోవైపు పారిశ్రామికవాడలున్న క్రమంలో అధికారులు విరివిగా పరీక్షలు చేస్తున్నారు. అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి పరిశీలిస్తున్నారు.

corona cases in nellore district
వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది
author img

By

Published : May 17, 2020, 5:46 PM IST

కోయంబేడు ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారానికి జిల్లాలో 149 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర అధికారిక బులెటిన్‌లో ప్రకటించారు. ఈ ఒక్కరోజే 9 మందికి సోకినట్లు పేర్కొనగా.. సూళ్లూరుపేట పరిధిలోనే ఇప్పటివరకు 34 కేసులు నమోదు కావడం గమనార్హం. మరికొన్ని ఫలితాలు వెల్లడి కావాల్సిఉంది. ప్రస్తుతం కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ ప్రక్రియ చేపడుతున్నారు. సూళ్లూరుపేటలో నమోదైన కేసుల్లో కూరగాయల వ్యాపారులు ఎక్కువగా ఉండటం, అంతా కోయంబేడుతో కాంటాక్టులు కలిగి ఉండటం సమస్యగా మారింది. ఒక్క కోయంబేడు వ్యవహారంలోనే కాదు.. గతంలోనూ జిల్లా పరిధిలో సూపర్‌ స్ప్రెడర్స్‌తో సమస్య నెలకొంది.

ఒకరి నుంచి పలువురికి..

జిల్లాలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే కొన్నిచోట్ల సూపర్‌ స్ప్రెడర్స్‌ కీలకంగా మారారన్నది తెలుస్తోంది. అధికార యంత్రాంగం పటిష్ఠ కట్టడి చర్యలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో కేసుల సంఖ్య పెరిగిందన్నది సుస్పష్టం. నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి ఏడుగురికి.. మరోవ్యక్తి నుంచి ఆరుగురికి సోకింది. ఇక్కడే వేరే ప్రాంతం నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి అయిదుగురికి సోకడం గమనార్హం.

వాకాడులో దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురిలో ఇద్దరి ద్వారా ఒక్కొక్కరికి.. మరో వ్యక్తి నుంచి ఇద్దరికి సోకింది. నాయుడుపేటలోనూ దిల్లీ నుంచి వచ్చిన అయిదుగురిలో ఒక వ్యక్తి ద్వారా ఇద్దరికి సోకింది. నగరంలోని మూలాపేట ప్రాంతంలోనూ ఒకే వ్యక్తి నుంచి ఆయన కుటుంబ సభ్యులకు సోకిన పరిస్థితి ఉంది. సూళ్లూరుపేటలోనూ తొలిరోజు 9 మందికి రాగా.. ఇందులో తమ వద్ద పనిచేసే ఓ కార్మికుడి నుంచి యజమాని కుటుంబానికి సోకింది. ఇలా చెప్పుకుంటూపోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి.

నేటితో ముగింపు..

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత లాక్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. కొత్త నిబంధనలతో నాలుగో విడత లాక్‌డౌన్‌ కొనసాగింపుపై స్పష్టత ఇస్తామని ప్రధాని మోదీ ఇదివరకే ప్రకటించారు. ఈ స్థితిలో కొత్త నిబంధనలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

అధికారులు మాత్రం కేసులు బయటపడిన కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. రాకపోకలపై నిషేధం విధించి, బారికేడ్లు ఏర్పాటు చేసి జనసంచారం లేకుండా కట్టడి చేస్తున్నారు. అనుమానితులను క్వారంటైన్‌కు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో కునారిల్లుతున్న పలు రంగాలు ఏ మేరకు తెరుచుకుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి... ప్రాణాలొడ్డి.. ప్రాణం పోస్తూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.