నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఆర్టీసీ డిపో నుంచి నెల్లూరు పాలెం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మధ్యలో డివైడర్ కట్టి మధ్యలో పూల మొక్కలు వేసేందుకు ప్రభుత్వం 16 లక్షల నిధులు మంజూరు చేసింది. టెండర్ని దక్కించుకున్న నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ పనులు చేసిన సదరు కాంట్రాక్టర్ మూడు సంవత్సరాల పాటు ఈ పూల మొక్కలను పర్యవేక్షించాలి. కానీ మొదటి బిల్లు తీసుకున్నప్పటి నుంచి వీటి పర్యవేక్షణ చూడకుండా వెళ్లిపోయాడు. విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్ సిబ్బంది ఈ మొక్కల పర్యవేక్షణ చూస్తున్నారు. ఈ మొక్కలు పెంచేందుకు రెండు బోర్లు వేశారు. కానీ వేసిన పైపులు నాసిరకంగా ఉండటంతో నీరు పైకి ఎక్కక పూల మొక్కలు ఎండిపోతున్నాయి. మధ్యలో వేసిన డివైడర్ పగుళ్ళు రావడంతో ఎక్కడ నీరు అక్కడే వృథాగా పోతుంది. అధికారులు ఇకనైనా స్పందించి మున్సిపాలిటీలో దారి పొడుగునా ఉన్న పూలమొక్కలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కాంట్రాక్టరు నిర్లక్ష్యం... మోడైపోతున్న పచ్చదనం - divider
లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నాటిన పూల చెట్లు... అధికారుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయి. పర్యవేక్షించాల్సిన కాంట్రాక్టర్ వదిలి వెళ్లి పోవడంతో అధికారులు తూతూమంత్రంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి నెల్లూరు పాలెం వరకు సుమారు 3 కిలో మీటర్ల మేర రోడ్డు మధ్యలో డివైడర్‌లో ఉన్న పూల మొక్కలు ఎండిపోతున్నాయి.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఆర్టీసీ డిపో నుంచి నెల్లూరు పాలెం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మధ్యలో డివైడర్ కట్టి మధ్యలో పూల మొక్కలు వేసేందుకు ప్రభుత్వం 16 లక్షల నిధులు మంజూరు చేసింది. టెండర్ని దక్కించుకున్న నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ పనులు చేసిన సదరు కాంట్రాక్టర్ మూడు సంవత్సరాల పాటు ఈ పూల మొక్కలను పర్యవేక్షించాలి. కానీ మొదటి బిల్లు తీసుకున్నప్పటి నుంచి వీటి పర్యవేక్షణ చూడకుండా వెళ్లిపోయాడు. విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్ సిబ్బంది ఈ మొక్కల పర్యవేక్షణ చూస్తున్నారు. ఈ మొక్కలు పెంచేందుకు రెండు బోర్లు వేశారు. కానీ వేసిన పైపులు నాసిరకంగా ఉండటంతో నీరు పైకి ఎక్కక పూల మొక్కలు ఎండిపోతున్నాయి. మధ్యలో వేసిన డివైడర్ పగుళ్ళు రావడంతో ఎక్కడ నీరు అక్కడే వృథాగా పోతుంది. అధికారులు ఇకనైనా స్పందించి మున్సిపాలిటీలో దారి పొడుగునా ఉన్న పూలమొక్కలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా