కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి భార్యను వారుంటున్న ఇంటి యజమాని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న అమానవీయ ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది. పట్టణంలోని కట్టెల వీధికి చెందిన నాగేశ్వరరావు కరోనా పరీక్షలు చేసుకోగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధరణైంది. దీంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం మృతి చెందారు. అతడి భార్య ఇవాళ ఉదయం ఇంటికెళ్లగా రానీయకుండా ఇంటి యజమాని అడ్డుకున్నారు. ఇంటికి తాళం వేయడంతో ఆమె లగేజీతో బయటే కూర్చొని రోధించారు.
ఇదీ చదవండి:
కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి