ETV Bharat / state

CM Jagan tour in flood affected areas: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన...బాధితులకు అండగా ఉంటానని హామీ

CM Jagan tour in flood affected areas: నెల్లూరు జిల్లాలో పెన్నా నది దిగువన పొర్లుకట్ట నిర్మాణానికి వంద కోట్లు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభించి పొర్లుకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద నష్టాన్ని పరిశీలించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం జగన్​ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం జగన్​ పర్యటనవరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం జగన్​ పర్యటన
author img

By

Published : Dec 3, 2021, 9:30 AM IST

Updated : Dec 4, 2021, 3:22 AM IST

CM Jagan tour in flood affected areas: తిరుపతి శ్రీకృష్ణనగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించారు. వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. పంటలు, పశువులను నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. తాను అండగా ఉంటానని జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. అంతకుముందు ఫొటో ప్రదర్శనను సీఎం తిలకించారు. నగరంలో వరద సృష్టించిన విలయాన్ని ఫొటో ప్రదర్శన ద్వారా అధికారులు జగన్‌కు వివరించారు. తిరుపతి పాడిపేటలో స్వర్ణముఖి నది వంతెనను సీఎం పరిశీలించారు. వంతెన కోతకు గురైన కారణాలను అధికారులు సీఎంకు వివరించారు.

వరదల సమయంలో స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న 30 మందిని కాపాడిన వారిని ముఖ్యమంత్రి జగన్‌ సన్మానించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తిరుచానూరు సమీపంలో కొట్టుకుపోయిన వంతెనను సీఎం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల జరిగిన నష్టం, దెబ్బతిన్న పంటలు, వంతెనల వివరాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలను తిలకించారు. సంబంధిత శాఖల అధికారులు శాఖల వారీగా జరిగిన నష్టం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం రేణిగుంట విమానశ్రయానికి చేరుకొని నెల్లూరు బయలుదేరారు..

10రోజుల్లో పీఆర్సీ..
CM Jagan tour in Tirupati: తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో సీఎం ఎదుట ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. పీఆర్సీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిరసన వ్యక్తంచేసిన ఉద్యోగులతో సీఎం జగన్​ మాట్లాడారు.‌ పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని.. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు.

నెల్లూరులో జగన్​ పర్యటన..
CM Jagan tour in nellore: తిరుపతిలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. రోడ్డు మార్గంలో నెల్లూరు రూరల్, కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో పర్యటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలతో పాటు దెబ్బతిన్న రోడ్లు, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ముందుగా నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాళెం వెళ్లారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రికి వరదల నష్టాన్ని వివరించారు. అక్కడే నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్​లోని ప్రతీ ఫోటోకు సంభందించి సీఎంకు వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. వరదలకు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని.. ఆయా పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దేవరపాళెం అనంతరం కోవూరు నియోజకవర్గ పరిధిలోని బుచ్చి మండలం పెనుబల్లికి చేరుకున్నారు. అక్కడ వరదలకు దెబ్బతిన్న కాలువలు, పంట పొలాలను పరిశీలించారు. కలెక్టర్ చక్రధర్ బాబుతో పాటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. స్వయంగా దెబ్బతిన్న ప్రదేశాలను ముఖ్యమంత్రికి చూపించారు. అక్కడి నుంచి జొన్నవాడకు చేరుకొని వరదలకు కొట్టుకుపోయిన రోడ్డును సీఎం పరిశీలించారు. అక్కడి నుంచి నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీకి చేరుకున్నారు. వరదలకు దెబ్బతిన్న నివాసాలను స్వయంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సాయం అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పెన్నా వంతెన నుంచి ఏరియల్ వ్యూ చేశారు. బ్యారేజీ పనుల వివరాలను మంత్రి అనీల్ కుమార్ యాదవ్​ను అడిగి తెలుసుకున్నారు.

పూర్తిగా ఇళ్లు ధ్వంసమైతే పక్కా ఇల్లు: సీఎం

cm jagan visit floods affected areas in nellore district: అనంతరం జాతీయ రహదారి మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసమైతే పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. పెన్నా నది దిగువన పొర్లుకట్ట నిర్మాణానికి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పొర్లుకట్ట నిర్మాణానికి సంక్రాంతి తర్వాత శంకుస్థాపన చేస్తానన్నారు. అలాగే సోమశిల మరమ్మతులకు రూ.120 కోట్లు మంజూరు చేశామని జగన్​ పేర్కొన్నారు. వరుస వరదలతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తనను ఆత్మీయంగా పలకరించేందుకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడినుంచి నేరుగా నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం... హెలికాఫ్టర్‌లో తిరుగుపయనమయ్యారు.

ఇదీ చదవండి:

cm jagan tour in kadapa : 'అన్ని విధాలా ఆదుకుంటాం...వరద బాధితులకు సీఎం భరోసా'

Last Updated : Dec 4, 2021, 3:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.