వలస కార్మికులు పాదరక్షలు లేకుండా వందల కిలోమీటరు నడుస్తున్నారు. ఓ దిక్కు కాళ్లు పగిలిపోతున్నాయి. ఎండ తీవ్రతకు కాళ్లు బొబ్బలు ఎక్కుతున్నాయి. రాళ్లు గుచ్చుకుని పుండ్లు పడుతున్నాయి. వారి పరిస్థితులను చూసిన నెల్లూరు నగరం సండే మార్కెట్ వ్యాపారస్థులు చలించిపోయారు.
జాతీయ రహదారిపై నడుస్తూ వెళ్తున్న వలస కార్మికులకు చెప్పులు పంపిణీ చేశారు. సుందరయ్య నగర్ వద్ద హైవే పై చెన్నై నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు వీటిని అందజేశారు. చెప్పుల జతలతోపాటు బిస్కెట్ ప్యాకెట్లు, ఆహారం అందజేశారు.
ఇదీ చూడండి:
తనపై తప్పుడు కేసులు పెట్టారని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం