నెల్లూరు జిల్లాలో వచ్చే నెల 3 వ తేది నుంచి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్రూసెల్లోసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గొర్రెల పెంపకం దారుల సహాయ సంచాలకులు దేవరాజు తెలిపారు. గొర్రెల, మేకల పెంపకదారులు 5 నుంచి 10 శాతం వరకు రైతులు ఈ వ్యాధి వలన నష్టపోతున్నారని ఆయన తెలియజేశారు. ఈ వ్యాధిని ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో పూర్తిగా నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ప్రతి మూడో శనివారం ఆయా గ్రామాలకు డాక్టర్లు వెళ్లి రక్త నమూనా పరీక్షలు నిర్వహిస్తానన్నారు. పొట్టేళ్లు, మేకలలో ఈ వ్యాధి ఉన్నట్లు రిపోర్టు వస్తే వెంటనే గొర్రెల మందలో నుంచి పొట్టేలు, మేకపోతును తొలగించాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున నష్టపోతారని ఆయన తెలిపారు. జిల్లాలోని గొర్రెల, మేకల పెంపకం దారులందరూ ఈ పరీక్షలు చేయించాలని ఆయన అన్నారు.
జూన్ 3 నుంచి బ్రూసెల్లోసిస్ పరీక్షలు - Brucellosis latest news nellore
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో జూన్ 3 వతేది నుంచి బ్రూసెల్లోసిస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సాంద్రత గొర్రెల పెంపకం దారుల సహయ సంచాలకులు దేవరాజు తెలిపారు. జిల్లాలోని గొర్రెల, మేకల పెంపకం దారులందరూ ఈ పరీక్షలు చేయించాలని ఆయన అన్నారు.
నెల్లూరు జిల్లాలో వచ్చే నెల 3 వ తేది నుంచి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్రూసెల్లోసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గొర్రెల పెంపకం దారుల సహాయ సంచాలకులు దేవరాజు తెలిపారు. గొర్రెల, మేకల పెంపకదారులు 5 నుంచి 10 శాతం వరకు రైతులు ఈ వ్యాధి వలన నష్టపోతున్నారని ఆయన తెలియజేశారు. ఈ వ్యాధిని ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో పూర్తిగా నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ప్రతి మూడో శనివారం ఆయా గ్రామాలకు డాక్టర్లు వెళ్లి రక్త నమూనా పరీక్షలు నిర్వహిస్తానన్నారు. పొట్టేళ్లు, మేకలలో ఈ వ్యాధి ఉన్నట్లు రిపోర్టు వస్తే వెంటనే గొర్రెల మందలో నుంచి పొట్టేలు, మేకపోతును తొలగించాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున నష్టపోతారని ఆయన తెలిపారు. జిల్లాలోని గొర్రెల, మేకల పెంపకం దారులందరూ ఈ పరీక్షలు చేయించాలని ఆయన అన్నారు.
ఇదీచదవండి: కబ్జా కోరల్లో పెన్నా విలవిల