BJP agent kidnap Attempt in Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని భాజపా నేతలు ఆరోపించారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో భాజపా ఏజెంట్ విష్ణుని కిడ్నాప్ చేసేందుకు పలువురు యత్నించారు. కారులో తీసుకెళ్తున్న ఏజెంట్‌ను భాజపా అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ తిమ్మనాయుడుపేట వద్ద గుర్తించి రక్షించారు. ఆ సమయంలో భాజపా, వైకాపా నాయకుల మధ్య తోపులాట జరిగింది.
ఈ విషయాన్ని జిల్లా ఎస్పీతో పాటు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కమలం పార్టీ నేతలు చెప్పారు. ఏజెంట్‌ను వైకాపా నాయకులే కిడ్నాప్‌నకు యత్నించారని ఆరోపించారు. పడమటి నాయుడుపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ఉన్న వైకాపా నాయకులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. వారంతా పోలీసులుపై ఎదురుదాడి చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ.. వెంటనే పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: