నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మద్యపానం వలన కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మద్యం సేవించడం వల్ల తలెత్తే పలు అనారోగ్య సమస్యలను ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు వివరించారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం, గొలుసు దుకాణాల నిర్మూలనకు జాగృతి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మద్యపానానికి దూరంగా ఉండేలా చైతన్యం కలిగిస్తున్నట్లు వివరించారు. మద్యపానానికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా బెల్టు షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది'