నెల్లూరు జిల్లా సంగం మండలం జండాదిబ్బ గ్రామంలో అప్పుల బాధతో ఉరివేసుకొని ఫణికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బ్రాందిషాపులో ఖాళీ మద్యం బాటిళ్లు సేకరించి.. వచ్చిన నగదుతో జీవితం కొనసాగించేవారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారం కూడా లేకుండా పోయింది. బతుకుదెరువు కోసం ఓ ఆటోను కొన్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా అదీ నడవలేదు. అప్పుల భారం పెరిగింది. కుటుంబ పోషణ కష్డంగా మారింది. తెచ్చిన అప్పులు తీర్చలేక... కుటుంబాన్ని పోషించే దారి కనిపించక ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండీ... ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద