ATTACK ON MPDO : మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఓ అధికారికి ఆమె బంధువులు దేహశుద్ధి చేశారు. నెల్లూరు జిల్లాలో ఓ పంచాయతీలో కార్యదర్శిగా పని చేస్తున్న మహిళపై.. ఎంపీడీవో రఫీఖాన్ గత రెండేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తనతో ఉండాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో.. ఆ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీడీవోపై వారు దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన ఉద్యోగులనూ కొట్టారు. వేధింపులకు పాల్పడుతున్న ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: