ఒంగోలు జీజీహెచ్లో(GGH ONGOLE) కొవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. చాలా మంది బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. పడకలు ఖాళీ అవుతున్నాయి. మూడో దశ వస్తే ఎదుర్కోవడమెలాగనే అంశంపై యంత్రాంగం దృష్టి సారిస్తోంది. ఎక్కువ కేసులొస్తే సరిపడా పడకలు, ఆక్సిజన్ ఉండేలా చూసుకుంటున్నారు. జీజీహెచ్లో ప్రస్తుతం రెండు ప్లాంట్ల ద్వారా 30 కిలోలీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సదుపాయం ఉంది. మూడో దశ(covid 3rd wave) దృష్ట్యా ఈ సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.
జర్మన్ హ్యాంగర్ విధానంలో 100 పడకలు
జీజీహెచ్(GGH)లో ప్రస్తుతం 12 వందల 90 పడకలు ఉండగా.. సుమారు వెయ్యి బెడ్స్‌కు ఆక్సిజన్ సౌకర్యముంది. వీటికి తోడు అదనపు పడకల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వైద్యకళాశాల మైదానంలో ఆక్సిజన్, ఏసీ సౌకర్యాలతో సుమారు 100 పడకల సామర్థ్యంతో జర్మన్ హ్యాంగర్ విధానంలో వార్డు ఏర్పాటు చేశారు. కొత్త వార్డు ఏర్పాటుతో పాటు మూడో ముప్పును ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి..
Corona cases: రాష్ట్రంలో కొత్తగా 3,620 కరోనా కేసులు, 41 మరణాలు