- ఆర్మీ ట్రక్కుకు ఘోర ప్రమాదం.. 16 మంది సైనికులు మృతి
ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి 16 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
- 'కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఒక్కసారి జగన్ బటన్ నొక్కాలి'
కడప ఉక్కు ఫ్యాక్టరీ మూడేళ్లలో పూర్తి చేస్తామని శంకుస్థాపన చేసిన రోజు ఇచ్చిన హామీ గుర్తుందా జగన్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. కన్నతల్లిలాంటి కడపకు, రాజకీయ జీవితం ఇచ్చిన రాయలసీమ గడ్డకు జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం విజనరీ పాలనకు, వైసీపీ ప్రభుత్వం ప్రిజనరీ పాలనకు ప్రతిరూపం అని లోకేశ్ ఎద్దేవా చేశారు.
- మరోసారి చర్చలోకి వైఎస్సార్ పేరు.. ఈసారి ఏకంగా కోడిగుడ్లపైనే
బాలింతలు, అంగన్వాడీలో చిన్నారులు, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది. అయితే సహజంగా ఆ కోడిగుడ్లు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం స్టాంపులు వేస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోడిగుడ్లపై వైఎస్సార్ స్టాంప్ వేసి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.
- 'చలో మాచర్ల'కు టీడీపీ పిలుపు.. నాయకులను అడ్డుకున్న పోలీసులు
పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై దాడులు నిరసిస్తూ ఆ పార్టీ నేతలు చలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కక్కడ నాయకులను అడ్డుకున్నారు.
- బాలికల పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు.. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠాలు చెప్పకుండా బాలికలను వెకిలి చేష్టలతో నానా ఇబ్బందులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఆవేశంలో వారు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేయడానికి ప్రయత్నించి, గదిలో నిర్బంధించారు.
- 'క్యాపిటల్ హిల్ దాడిలో ట్రంప్ పాత్ర.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై నిషేధం!'
అమెరికాలో 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడిలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందని హౌస్ సెలక్ట్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన కమిటీ.. భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ప్రతిపాదన చేసింది.
- ఐటీఆర్ ఇంకా ఫైల్ చేయలేదా? ఇదే లాస్ట్ ఛాన్స్!
ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ చేయడానికి ఆఖరు తేదీ ఈ ఏడాది జులై 31. అయితే, ఇప్పటి వరకు కూడా రిటర్నులు ఫైల్ చేయని వారు చాలా మందే ఉన్నారు. మరి వీరు ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటే ఎలా చేయాలి? ఇప్పుడు చూద్దాం..
- కైకాల భౌతికకాయం వద్ద కన్నీరు పెట్టిన చిరంజీవి ఓదార్చిన పవన్
వెండితెర వేదికగా ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన్ను భౌతికకాయాన్ని చూసేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు. అయితే కైకాల పార్థివదేహాన్ని చూడటానికి వచ్చిన చిరంజీవి కంటతడి పెట్టారు. అయితే అక్కడే ఉన్న పవన్ చిరును ఓదార్చినట్లు కనిపించింది. వాటికి సంబంధించిన ఫొటోలు చూసేయండి.
- స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 980 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 980 పాయింట్లు కోల్పోయి 59,845 వద్ద ముగిసింది. నిఫ్టీ 320 పాయింట్లు తగ్గి 17,806 వద్ద స్థిరపడింది.
- కుమారుడు హత్యకు గురైన 4 రోజులకే తల్లి కూడా.. టీచర్ ఉన్మాదానికి రెండు ప్రాణాలు బలి
ఉపాధ్యాయుడి దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లి కూడా.. నాలుగు రోజులకు మరణించింది. కుమారుడ్ని రక్షించే ప్రయత్నంలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె గురువారం తుదిశ్వాస విడిచింది. కర్ణాటక గడగ్ జిల్లాలో జరిగిందీ ఘటన.