నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఇప్పటిదాకా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో.... అది మెల్లగా సాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గ వాసులకు రెండు రోజులు పంపిణీ చేసి నిలిపివేశారు.
మందు తయారీకి ఆనందయ్య బృందమున్నా సామగ్రి కొరత, తయారీ యంత్రాల లేమి వేధిస్తున్నాయి. వాలంటీర్ల ద్వారా పంపిణీని గొలగమూడిలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. మనుబోలులోనూ మందు పంపిణీ మొదలైంది. జిల్లా అంతటా ఈ విధానం అమల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. పెద్ద ఎత్తున పంపిణీకి ఉన్న సమస్యలను వివరిస్తూ ఆనందయ్య ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
ఇదీ చదవండి: