నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. చెన్నైకి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. హరిప్రసాద్ డబ్బులు ఇవ్వకపోవటంతో ఆ దుండగుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
అక్కడే కుప్పకూలిపోయిన అతన్ని.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతనికి ఏడు చోట్ల గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపరిచిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: