ETV Bharat / state

మంత్రి కాకాణీ గారూ.. మీకు నైతికత లేదా​? - ఏపీ ముఖ్యవార్తలు

ALLEGATIONS ON MINISTER KAKANI: ప్రజాప్రతినిధి అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. పదవిలో ఉండేవారు పది మందికీ ఆదర్శంగా ఉండాలి. నైతిక విలువలు, నిజాయతీ, నిబద్ధత కలిగి ఉండాలి. అందులోనూ మంత్రి పదవిలో ఉండేవారికి నైతికత, ప్రజాస్వామ్యంపై గౌరవం రెండింతలు ఎక్కువగానే ఉండాలి. కానీ.. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇవేమీ లేనట్లు కనిపిస్తోంది. నైతికత, నిజాయతీ అనే పదాలకు తన డిక్షనరీలోనే చోటు లేదన్నట్లుంది ఆయన వ్యవహార శైలి. కాకాణి A-1గా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాల చోరీ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినా ఆయన మంత్రి పదవిని పట్టుకుని వేలాడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

MINISTER KAKANI
MINISTER KAKANI
author img

By

Published : Dec 16, 2022, 10:17 AM IST

కాకాణికి నైతికత ఉంటే రాజీనామా చేయాలి

MINISTER KAKANI : ఫోర్జరీ కేసులో ఆధారాల చోరీ ఘటనపై అందరూ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై వేలెత్తి చూపుతున్నా.. ఆయనకు చీమ కుట్టినట్టూ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంలో మిమ్మల్ని ప్రతివాదిగా చేర్చినా, సీబీఐ కేసు నమోదు చేసినా.. ఏమీ పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నారు? మంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పదవే ముఖ్యమని అనుకుంటూ నైతికత, విలువల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ప్రజాప్రతినిధులకు నైతికత అవసరం: ప్రజా ప్రతినిధులకు ఉండాల్సిన నైతిక ప్రవర్తన గురించి కోర్టు చాలా విస్పష్టంగా చెప్పింది. ఐదు కోట్ల ప్రజల్ని పాలించే ముఖ్యమంత్రి, మంత్రులకు ఎంత నైతికత ఉండాలి? వారి డిక్షనరీలో నైతికత అన్న పదానికి చోటే లేదు. దానికి తాజా ఉదాహరణ కాకాణి గోవర్ధనరెడ్డి. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడో రోజే... నెల్లూరులోని ఒక కోర్టు నుంచి ఫోర్జరీ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు చోరీకి గురయ్యాయి. ఇనుము దొంగతనానికి వచ్చిన దొంగలు.. కుక్కలు తరిమితే కోర్టులోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారని నెల్లూరు జిల్లా పోలీసులు హాస్యాస్పదమైన వాదన వినిపించారు. కాకాణే ఆ పని చేయించారని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపించాయి.

కట్టుకథ అల్లి.. పత్రాలు పోయాయని ఆరోపించి: కొన్నాళ్లకు ఫోర్జరీ కేసులో ఆధారాల చోరీ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఆ ప్రాపర్టీ కోర్టు రక్షణలోనే లేదని, పోలీసు స్టేషన్‌లోనే ఉన్నట్టు తన విచారణలో తేలిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. బెంచి క్లర్క్, గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై కట్టుకథ అల్లారని, పత్రాలు పోయాయని తప్పుదారి పట్టించారన్నారు.

‘క్రైమ్‌ నెం.521/2016 కేసులో ఏ1 కాకాణి గోవర్ధనరెడ్డి. ఇప్పుడు ఆయన మంత్రి. కోర్టులో చోరీ జరిగినప్పుడు ఘటనా స్థలంలోని పాదముద్రలను, విరిగిపోయిన ప్రధాన ద్వారంపై వేలిముద్రల్ని పోలీసులు సేకరించలేదు. డాగ్‌ స్క్వాడ్‌నీ పిలవలేదు. వీటన్నింటినీ చూస్తే ఈ కేసు దర్యాప్తు సరైన విధానంలో జరుగుతున్నట్టుగా లేదు. ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే తప్ప నిజాలు వెలుగులోకి రావు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని నివేదించారు. దీనిని సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రతివాదుల జాబితాలో మంత్రి కాకాణి పేరును కూడా చేర్చింది.

కాకాణికి నైతికత ఉంటే రాజీనామా చేయాలి: కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఇంత తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందుకు.. ఏ మాత్రం నైతికత, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నా మంత్రి పదవికి కాకాణి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయలేదు. చేయాల్సిందిగా ముఖ్యమంత్రీ కోరలేదు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ మంగళవారం కేసు కూడా నమోదు చేసింది. కాకాణికి ఏమాత్రం నైతికత ఉన్నా.. ఇప్పటికైనా రాజీనామా చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రే ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖలో 70 ఎకరాలకు పైగా అత్యంత విలువైన భూములకు దొడ్డిదారిన ఎన్వోసీలు ఇప్పించి, కుటుంబసభ్యులు, సన్నిహితుల పేరు మీద ఆ భూములు కొట్టేశారని సిట్‌ నిగ్గు తేల్చింది. ఏ మాత్రం నైతికత ఉన్నా ఆయన రాజీనామా చేయాలి.. లేదంటే ముఖ్యమంత్రి జగన్‌ అయినా ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలి.. కానీ ధర్మాన మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు.

కాకాణి గోవర్ధన్‌రెడ్డిదీ అదే దారి. ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా, ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. కాకాణి అసలేమీ పట్టనట్టే ఉన్నారు. సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో ఆయన మంత్రిగా కొనసాగితే... సాక్షుల్ని, దర్యాప్తును ప్రభావితం చేయరా?... వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందానికి ఎలాంటి బెదిరింపులు ఎదురయ్యాయో రాష్ట్ర ప్రజలు చూశారు.

కాకాణిపై కేసులో ఆధారాలు కోర్టులో లేకపోయినా అవి చోరీ జరిగినట్టుగా ఎందుకు డ్రామా: రాష్ట్రంలో ఆ కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదని తెలంగాణకు మారుస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైకాపా పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, రాష్ట్ర పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారో దాన్నిబట్టే అర్థమైంది. అలాంటప్పుడు కాకాణి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు మాటేంటి? కాకాణిపై కేసులో ఆధారాలు కోర్టులో లేకపోయినా అవి చోరీ జరిగినట్టుగా ఎందుకు డ్రామా ఆడారు? ఆ పేరుతో పోలీసుస్టేషన్‌లో ఉన్న ఆధారాల్ని నాశనం చేయాలనుకున్నారా? జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణ చేసి కనుక్కునేంత వరకు... అవి పోలీసుస్టేషన్‌లోనే ఉన్న విషయాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం ఎందుకు బయటపెట్టలేదు? చోరీకి గురైన ఆధారాల్లో కొన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా, అవి కాకాణిపై ఉన్న ఫోర్జరీ కేసుకి సంబంధించినవే అన్నట్టుగా ఎందుకు నాటకాలాడారు? కాకాణి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడో రోజు నుంచే ఆ డ్రామా మొదలైందంటేనే.. దాని వెనక ఏదో మంత్రాంగం జరిగిందన్న అనుమానాలు వస్తున్నప్పుడు... ఆయనను మంత్రిగా కొనసాగితే దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా? అసలు దోషులు బయటకు వస్తారా? ఇవన్నీ ఇప్పుడు విపక్షాలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.

2016లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధనరెడ్డి... తన రాజకీయ ప్రత్యర్థి, టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనకు విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపించారు. ఆధారాలున్నాయంటూ కొన్ని పత్రాలు విడుదల చేశారు. కాకాణి ఫోర్జరీ పత్రాలను సృష్టించి తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకాణిని ఏ1గా పేర్కొంటూ ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నెల్లూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అభియోగపత్రం వేశారు.

ఆ కేసు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టుకి బదిలీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 13న అర్ధరాత్రి దాటాక నెల్లూరులోని నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దొంగతనం జరిగింది. అవి కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలని కోర్టు బెంచ్‌ క్లర్క్‌ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్స్‌ విజయవాడ కోర్టుకి పంపినప్పటికీ, కేసు ప్రాపర్టీ ఇంకా పంపలేదని, అదే చోరీకి గురైందని పేర్కొన్నారు. నెల్లూరు చిన్నబజార్‌ స్టేషన్‌ పోలీసులు.... 14ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశమున్న ఐపీసీ సెక్షన్‌ 457.... ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశమున్న సెక్షన్‌ 380 కింద కేసు నమోదు చేశారు.

సాక్ష్యాల్ని నాశనం చేసేందుకు పెద్ద కుట్రే జరిగిందన్న అనుమానాలు: కాకాణి గోవర్ధనరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడో రోజే... నెల్లూరు కోర్టులో చోరీ ఘటన జరగడం, ఆ తర్వాత అదో డ్రామా అని తేలడం వంటి పరిణామాలన్నీ చూస్తే... సాక్ష్యాల్ని నాశనం చేసేందుకు పెద్ద కుట్రే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని వెనుక కాకాణి హస్తం ఉందని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. ఫోర్జరీ కేసులో కాకాణి నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్లు మాత్రమే శిక్షపడే అవకాశం ఉందని, అదే కోర్టు నుంచి ఆధారాల చోరీ కేసులో గనుక మంత్రి పాత్ర ఉందని దర్యాప్తులో తేలితే 14 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనికి దిల్లీలో ఉపహార్‌ సినిమా థియేటర్‌లో అగ్ని ప్రమాదం ఘటనను ఉదాహరణగా చెబుతున్నారు.

1997లో దిల్లీ ఉపహార్ థియేటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 59 మంది సజీవ దహనమయ్యారు. థియేటర్‌ నిర్వాహకులైన సుశీల్‌ అన్సాల్, గోపాల్‌ అన్సాల్‌పై కేసు నమోదైంది. న్యాయస్థానం అధీనంలో ఉన్న సాక్ష్యాధారాల తారుమారుకు ప్రయత్నించారన్న అభియోగంపై మరో కేసు నమోదైంది. అగ్ని ప్రమాదం కేసులో సోదరులిద్దరూ ఒక్కొక్కరూ 30 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటికే ఏడాది పాటు వారు జైళ్లో ఉండటంతో వారికి జైలు శిక్ష విధించలేదు. కానీ న్యాయస్థానం స్వాధీనంలో ఉన్న రికార్డులను కుట్రపూరితంగా మాయం చేయడం, తారుమారు చేసిన కేసులో మాత్రం సోదరులిద్దరికీ ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2.25 కోట్ల జరిమానా విధించింది. జైలు శిక్షను నిలిపేయాలని నిందితులు పై కోర్టులను ఆశ్రయించినా వారికి నిరాశే ఎదురైంది.

న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది: ఫోర్జరీ కేసులో ఆధారాల చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విషయంలో దోషులకు సత్వరం శిక్ష పడేలా చేయకపోతే న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని.. సుప్రీంకోర్టు అశ్వినీకుమార్ ఉపాధ్యాయ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో చెప్పినట్టు గుర్తు చేసింది. ఏ కేసుకి సంబంధించి ఆధారాల చోరీ జరిగిందో... ఆ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభావవంతమైన మంత్రి పదవిలో ఉన్నందున.. ఈ ఘటన మూలాల్లోకి వెళ్లి బాధ్యుల్ని గుర్తించాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీవ్రమైన అభియోగాలున్నా.. కాకాణి మంత్రిగా కొనసాగుతుండటంతో సీబీఐ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.