ETV Bharat / state

ప్రేమించిన యువతిని తుపాకీతో కాల్చి.. ఆపై తానూ కాల్చుకొని.. - Nellore SP on Fire Incident

young man who shot and killed the young woman
నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
author img

By

Published : May 9, 2022, 4:31 PM IST

Updated : May 9, 2022, 9:33 PM IST

16:27 May 09

నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

కావ్య రెడ్డిపై సురేష్‌ రెడ్డి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు: ఎస్పీ

Fired on a Woman at Nellore District: నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపి హత్యచేశాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పొదలకూరు మండలం తాడిపర్తికి చెందిన సురేశ్‌రెడ్డి, కావ్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. సురేశ్ రెడ్డి బెంగళూరులో, కావ్య ముంబయిలో పనిచేస్తున్నారు.

ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం నడుస్తుండడంతో.. వీరిద్దరూ తమ స్వగ్రామమైన తాడిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతకాలంగా.. ప్రేమ పేరుతో సురేశ్​ కావ్య వెెంటపడ్డినట్లు తెలుస్తోంది. కావ్యను పెళ్లి చేసుకునేందుకు తమ ఇంటి నుంచి పెద్దలను.. కావ్య ఇంటికి పంపించినట్టు సమాచారం. అయితే.. వీరి పెళ్లికి కావ్య కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో.. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో.. సురేశ్‌ కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొనఊపిరితో ఉన్న కావ్యను స్థానికులు హుటాహుటిన నెల్లూరు ఆస్పత్రికి తరలించగా.. మార్గంమధ్యలో ఆమె మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులతో కలిసి పొదలకూరు తహసీల్దార్‌ సుధీర్‌బాబు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.

Nellore SP on Fire Incident: యువతిపై కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విజయరావు మీడియా వెల్లడించారు. కావ్యను సురేష్‌ రెడ్డి ఏకపక్షంగా ప్రేమించాడని తెలిపారు. ఈ క్రమంలో సురేశ్​ పంపిన పెళ్లి ప్రతిపాదనను కావ్య కుటుంబసభ్యులు తిరస్కరించినట్లు చెప్పారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం కావ్య రెడ్డిపై సురేష్‌ రెడ్డి కాల్పులు జరిపాడని తెలిపారు. కావ్య శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్పీ తెలిపారు. సురేశ్​ సెల్​ ఫోన్ల ఆధారంగా.. తుపాకీ ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నట్లు వివరించారు.

కావ్య రెడ్డిపై సురేష్‌ రెడ్డి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండో రౌండ్‌ కాల్పుల్లో కావ్య తల నుంచి తూటా దూసుకెళ్లింది. కావ్య రెడ్డి శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. సురేష్‌ రెడ్డి వైపు నుంచి ఏకపక్షంగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఒకే గ్రామానికి చెందిన కావ్యకు మెసేజ్‌లు పెట్టే ఇబ్బంది పెట్టేవాడు.పెళ్లి చేసుకుంటానని గతనెల యువతి ఇంటికి పెద్దలను పంపాడు. పెళ్లి ప్రతిపాదనను కావ్య కుటుంబసభ్యులు తిరస్కరించారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 3 తర్వాత కావ్య ఇంటికి వెళ్లి, అడ్డువచ్చిన కావ్య చెల్లెలిని తోసేసి కావ్యపై కాల్పులు జరిపాడు. సురేశ్​​ వాడిన తుపాకీపై మేడ్‌ ఇన్‌ యూఎస్‌ఏ అని ఉంది. అతని తుపాకీ ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నాం. అతడికి చెందిన 2 సెల్‌ఫోన్లు సీజ్‌ చేశాం. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తాం. సురేష్‌రెడ్డి, కావ్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. సురేష్‌రెడ్డి బెంగళూరులో, కావ్య ముంబయిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కరోనా వేళ ఇద్దరూ ఇంటి నుంచి పనిచేస్తున్నారు. -విజయరావు, నెల్లూరు ఎస్పీ

ఇదీ చదవండి: DIED: మద్యం మత్తులో ఎంత పని చేశాడంటే..!

Last Updated : May 9, 2022, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.