నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం జగన్నాదరావుపేట కాలనీకి చెందిన భవాని చీటీలు కట్టేది. తన భర్తకు ప్రమాదంలో కాలు విరగడం వల్ల వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. భవాని టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో చీటీ కట్టలేకపోయింది. ఈ విషయాన్ని చీటీ తీసుకున్న వారికి చెప్పగా.. వారు ఘర్షణకు దిగారు. ఎలాగైనా తమ సొమ్ము తిరిగి ఇచ్చేయాలని భవాని ఇంటి ముందు దుర్భాషలాడారు. ఈ విషయాన్ని భవాని స్థానిక పోలీసులకు రాతపూర్వకంగా తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించారు. అయినప్పటికీ రాత్రి భవాని టిఫిన్ బండికి తాళం వేసి డబ్బులివ్వాల్సిందే అని దూషించారు. దీని వల్ల మనస్తాపం చెందిన భవాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవానీని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: