ETV Bharat / state

psycho : 108 కూత వినిపిస్తే ఒప్పుకోను... నడిరోడ్డుపై వాహనం అడ్డగించి హల్ చల్ - 108 అంబులెన్స్

psycho created chaos : నెల్లూరు నగరంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై గందరగోళం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న 108 అంబులెన్స్ వాహనానికి అడ్డుపడి.. డ్రైవర్​ను దూషించాడు. వాహనం వెళ్లకుండా అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. అప్పటికే అటుగా వచ్చిన వ్యక్తులు వారించినా వినిపించుకోలేదు. దాదాపు గంట సేపటి తర్వాత మేల్కొన్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 14, 2023, 6:12 PM IST

Updated : Apr 15, 2023, 6:26 AM IST

నడిరోడ్డుపై హల్​చల్

psycho created chaos : నెల్లూరు నడిరోడ్డుపై ఓ వ్యక్తి గందరగోళం సృష్టించాడు. 108 అంబులెన్స్ కు అడ్డుపడి వాహన సిబ్బందిపై బూతుల దండకం అందుకున్నాడు. దీంతో వాహనం గంటసేపు నిలిచిపోగా.. ట్రాఫిక్ స్తంభించింది. అయినప్పటికీ పోలీసులు స్పందించలేదు. నడిరోడ్డుపై పబ్లిక్ పెద్ద ఎత్తున గుమికూడడంతో గంట తరువాత వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి సైకో ప్రవర్తన కారణంగా దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంపై స్థానికులు, వాహనచోదకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ఆలస్యంగా మేల్కొవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక మారుమూల గ్రామాల్లో భద్రత ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు.

గంటకు పైగా నిలిచిన ట్రాఫిక్... నెల్లూరు నగరంలో ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించారు. అత్యవసర సర్వీసులో తిరుగుతున్న 108అంబులెన్స్ ను గంటసేపుపైగా రోడ్డుపైన నిలిపివేశాడు. తనకు అంబులెన్స్ శబ్దం చిరాకు తెప్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాహనం కదలకుండా తన స్కూటర్ ని అడ్డుగా పెట్టాడు. మరో స్నేహితుడు అతడిని సమర్థించాడు. ఇరిగేషన్ ఉద్యోగినని రోడ్డుపై హల్ చల్ చేయగా.. మరోవైపు వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నడిరోడ్డుపై హల్​చల్... నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో స్కూటర్ పై వచ్చిన ఓ వ్యక్తి 108 అంబులెన్స్ సిబ్బందిని నానా బూతులు తిట్టాడు. వినలేని విధంగా తిడుతూ హల్ చేశాడు. అంబులెన్స్ శబ్దం తనకు ఇష్టం లేదని, వెనకనే వస్తుందని, రోజుకు ఎన్ని తిప్పుతారంటూ స్కూటర్ ని అడ్డుగా పెట్టి రోడ్డుపై గందరగోళం సృష్టించాడు.

నిన్న జరిగిన ఈ సంఘటను ఓ వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంటసేపు అంబులెన్స్ ను నిలిపివేసి, నోటికి వచ్చిన విధంగా తిడుతున్నా జనం కొద్దిసేపు చూస్తూనే ఉన్నారు తప్ప.. వారించలేదు. అడ్డుకోలేదు. పోలీసులు కూడా ధైర్యం చేసి ఏమీ అనలేక పోయారు. తన పేరు షేక్ అబ్దుల్ ఫయాజ్ అని.. ఇరిగేషన్ ఉద్యోగినని చెప్పాడు. తాను మద్యం తాగలేదని అంటూనే అంబులెన్స్ సిబ్బందిని బూతుల దండకం మొదలు పెట్టాడు. పక్కనే మరో వ్యక్తి కూడా అతడిని సమర్థించాడు. అర గంట తర్వాత ముగ్గురు వ్యక్తులు వచ్చి గొడవకు దిగినా.. స్కూటర్ ని అడ్డు తీయలేదు. గంట తరువాత పోలీసులు వచ్చి అతడిని స్టేషన్​కు తరలించారు.

రోడ్డుపై వెళ్తున్న 108 వాహనం హారన్ వల్ల ఇబ్బందిగా ఉందని రోడ్డుకు అడ్డంగా వచ్చి నిలిపేశాడు. అంబులెన్స్ డ్రైవర్​ను దూషించడంతో పాటు వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డపడ్డాడు. దీంతో నడిరోడ్డు మీద బండి ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. ఇలాంటి సైకోల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అత్యవసర సమయంలో వెళ్తున్న వాహనాన్ని ఆపడం ఎంత వరకు సమంజసం. - స్థానికుడు

ఇవీ చదవండి :

Last Updated : Apr 15, 2023, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.