నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు హరిజనవాడలో దారుణం జరిగింది. మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును తండ్రే హతమార్చాడు. దీంతో స్థానికంగా కలకలం రేపింది. హరిజనవాడకు చెందిన కోటేశ్వరరావు కుమారుడు శివకుమార్.. తరచూ మద్యం తాగొచ్చి ఇంట్లో వాళ్లను వేధింపులకు గురిచేసేవాడని తండ్రి తెలిపాడు. కొడుకును పలుమార్లు మందలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పటికైనా కుమారుడు మారుతాడని ఆశించినా.. అతనిలో ఎలాంటి మార్పు లేకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తండ్రీకొడుకులిద్దరూ ఘర్షణ పడ్డారు.
కోపోద్రిక్తుడైన తండ్రి.. ఇనుప రాడ్తో దాడి చేయగా శివకుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి..
TADEPALLI RAPE CASE: 'అత్యాచార నిందితులను త్వరలోనే పట్టుకుంటాం'