suffering from conversion of Patta land: దివ్యాంగుడని తెలిసినా అధికారులు అతడిని గత ఐదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిప్పుతున్న ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఇర్లపాడులో చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి ఐదు సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్న ఓ దివ్యాంగుడు దీన గాధ చూసిన ప్రతి ఒక్కరికి మనసు చలించక తప్పదు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన డీ. శ్రీనివాసులు పుట్టుకతోనే దివ్యాంగుడు. తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఎకరం భూమిని 1997 నుంచి సాగు చేసుకుంటున్నాడు.
2017లో రైతు పట్టా భూమి కాస్త ప్రభుత్వ భూమిగా రికార్డులలో నమోదైంది. అప్పటి నుండి అతనికి వన్ బి అడంగల్ రాలేదు.. దాంతో ప్రభుత్వం నుంచి రావల్సిన పథకాలు రావటం లేదు. దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తహసిల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. మారిన తమ సొంత భూమిని రైతు పట్టాగా మార్పు కోసం నేడు ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు రావడంతో అతని ఇబ్బందిని గమనించిన ఈటీవీ భరత్ అతని వివరాలు అడగగా.. ఐదు సంవత్సరాల నుంచి అధికారులు చేసిన తప్పుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికైనా అధికారులు వారి తప్పును సరిదిద్దుకొని తన భూమిని రైతు పట్టాగా మార్పు చేయవలసిందిగా శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇవీ చదవండి