నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పంచాయతీ పరిధిలోని గొట్లపాలెంలో మహిళ దారుణ హత్యకు గురైంది. సహజీవనం చేస్తున్న వ్యక్తే మద్యం మత్తులో దారుణంగా కొట్టటంతో, స్పృహతప్పి పడిపోయిన మహిళ మరణించిందని భావించి...సజీవంగా పూడ్చిపెట్టినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులు క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొన్నూరు సుభాషిణి అనే మహిళ భర్తను వదిలి బుడబుక్కల సాములు అనే వ్యక్తితో గొట్లపాళెంలో పొలాల గట్టుపై నివాసం ఉంటోంది. రెండు రోజుల క్రితం ఇద్దరూ గొడవపడ్డారు. సాములు కర్రతో సుభాషిణీని బలంగా కొట్టాడు. కర్ర దెబ్బకు స్పృహ తప్పి పడిపోయిన మహిళ మరణించిందని భావించిన సాములు, ఆమెను సమీపంలోని చెట్ల పొదల దగ్గర పూడ్చిపెట్టాడు.
పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళను హత్య చేసిన సాములు పరారీలో ఉన్నాడు.
ఇదీ చూడండి