ETV Bharat / state

సీఎం జగన్ పనితీరు ఆర్భాటాలకు చాలా దగ్గరగా-వైద్య సేవలకు ఆమడ దూరంగా ఉంది - అద్దె భవనాల్లో ఆరోగ్య కేంద్రం

YSRCP Government Careless on Urban Health Center: ప్రతీ గ్రామంలో ఆసుపత్రులు.. ఇళ్లవద్దకే వైద్య సేవలు.. ప్రతీ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పే మాటలివి. కానీ చాలాచోట్ల అరకొర వైద్యసేవలే అందుతున్నాయి. వైద్య పరికరాలు ఉన్నా జనానికి అక్కరకు రావడం లేదు. అటకపైనే అవి పాడైపోతున్నాయి.

YSRCP_Government_Careless_on_Urban_Health_Center

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 8:49 AM IST

Updated : Nov 8, 2023, 10:11 AM IST

సీఎం జగన్ పనితీరు ఆర్భాటాలకు చాలా దగ్గరగా-వైద్య సేవలకు ఆమడ దూరంగా ఉంది

YSRCP Government Careless on Urban Health Center : ముఖ్యమంత్రి ఆర్భాటపు ప్రకటనలు ఎలా ఉన్నా. .వాస్తవానికి గ్రామీణులకే కాదు.. పట్టణ ప్రాంత ప్రజలకూ ప్రభుత్వ వైద్య సేవలు (Government Medical Services) సక్రమంగా అందడం లేదు. కొవిడ్ సమయంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలకు (Urban Health Center) పంపిన పడకలు, కుర్చీలు, ఫర్నిచర్, వైద్య పరికరాలు ఇప్పటికీ పెట్టెల నుంచి బయటకు తీయకుండా ఉంచారు. వీటిని వినియోగించకుండానే పేదల ముగింటకు వైద్య సేవలు అందుతున్నాయని సాక్షాత్తు సీఎం ప్రకటించడమే విచిత్రంగా ఉంది.

Urban Health Center Situation Under CM Jagan Ruling : పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు ఘోరంగా ఉంది. కొన్నిచోట్ల ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయన్న విషయం స్థానికులకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాలతో పాటు పట్టణాలు, నగర ప్రాంతాల్లోనూ ప్రజలు వైద్యం కోసం ఆర్ఎంపీలు, ప్రయివేటు వైద్యుల వద్దకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఆరోగ్య కేంద్రాలపై అవగాహన కల్పించకపోవడంతో చాలాచోట్ల సగటున రోజుకు 40 నుంచి 50 వరకు మాత్రమే ఓపీ ఉంటోంది. వాస్తవానికి ఈ కేంద్రాల్లో 64 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉన్నా.. బీపీ, షుగర్, టైఫాయిడ్, మలేరియా, సీపీబీ వంటి పరీక్షలను మాత్రమే పరిమితంగా చేస్తున్నారు. మరోవైపు ఒప్పంద విధానంలో పనిచేస్తున్న వైద్యులు పలు కారణాలతో వెళ్లిపోతుండడంతో ఈ కేంద్రాల్లో అందే వైద్య సేవలపై స్థానికుల్లో విశ్వాసం పెంపొందడంలేదు.

రాష్ట్రంలో బేబీ కిట్ పథకానికి బై బై, ఎందుకు ఆగిందో జగన్​కే తెలియాలి?

Health Center in Rented Buildings in Parvathipuram : కొవిడ్ సమయంలోనే (Covid Time) ఈ కేంద్రాలకు అవసరమైన వైద్య పరికరాలు, పరుపులు, మంచాలు, ఇతర ఫర్నిచర్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ నాడు-నేడు (Nadu-Nedu) కింద చేపట్టిన నిర్మాణ పనులు కొన్నిచోట్ల నత్తనడకన సాగుతుండడంతో అద్దె భవనాల్లోని ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసిన పరికరాలు పెట్టెల్లోనే మగ్గుతున్నాయి. పార్వతీపురం పట్టణంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఇదే పరిస్థితి.

No Medical devices in Urban Health Center : విశాఖ నగరం 65వ వార్డు గిరిజా కాలనీ ఆరోగ్య కేంద్రం ఇరుకుగా ఉండి స్థలం సరిపోవడం లేదనే కారణంతో వైద్య పరికరాలను పెట్టెల నుంచి తీయలేదు. విజయనగరంలో సాయినాథ్ కాలనీలో చిన్న గదిలోనే ఆరోగ్య కేంద్రం (Health Center) నిర్వహిస్తున్నారు. అందులోనే ఫర్నిచర్ పెట్టెలు పెట్టడంతో రోగులు కూర్చునే వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఉల్లివీధిలోనూ ఇదే పరిస్థితి ఉంది.

పర్యవేక్షణ లేక.. పల్లె వైద్యం పడక

Government Medical Services In AP : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో ఆరోగ్య కేంద్రం కచేరిచావిడి భవనం ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడా ఫర్నిచర్, పరీక్షల నిర్వహణ పరికరాలు పెట్టెలకే పరిమితమయ్యాయి.

విశాఖ గాజువాక పరిధిలోని దయ్నాగర్‌లో UPHC (Urban Primary Health Center) నూతన భవన నిర్మాణం 4 నెలల కిందట పూర్తయినా.. వైద్యారోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. ఎంవీపీ కాలనీ సెక్టారు-9లోని కేంద్రంలో పనిచేసే ల్యాబ్ టెక్నిషియన్ ప్రసూతి సెలవులో ఉండడంతో ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు.

వెలవెలబోతున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు

Last Updated : Nov 8, 2023, 10:11 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.