Government Neglect on Kurupam Tribal Engineering College : "రాష్ట్రంలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనులకు మంచి చేయాలని, వారి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నం చేస్తున్నాం. గిరిజనులు సొంత కుటుంబం అనుకుని అడుగులు ముందుకు వేస్తున్నాను."- 2020 అక్టోబరు 2న సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలివి.
CM Jagan Cheted SC&ST : ఎస్సీ, ఎస్టీలపై తనకే పేటెంట్ ఉన్నట్లు మాట్లాడే సీఎం సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తి చేయడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. కళాశాల మంజూరు, శంకుస్థాపనలతోనే తన పని అపోయినట్లు చేతులు దులిపేసుకున్నారు. ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోవడంతో కాకినాడ జేఎన్‌టీయూ ఇచ్చిన నిధులతోనే కొంత వరకు నిర్మాణాలు చేపట్టారు. వసతులు లేకపోవడంతో మూడు సంవత్సరాలుగా ప్రవేశాలను వాయిదా వేస్తున్నారు. కళాశాలకు మంజూరు చేసిన 80 అధ్యాపక పోస్టులను విశ్వవిద్యాలయానికి మళ్లించేశారు.
CM Jagan Does Not Care SC&ST Youth Employment: కళాశాలలో నైపుణ్యాల కొరత.. ప్రశ్నార్థకంగా యువత భవిష్యత్
Delay Works In Engineering College In Kurupam : ఎస్టీల్లో ఇంజినీరింగ్ చదువుతున్నవారే తక్కువ. అందులోను ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందుతున్న వారు 35 శాతానికి మించడం లేదు. గత సంవత్సరం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో కేవలం ఇద్దరు ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందినా కోర్సు పూర్తి చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్టీ విద్యార్థులకు విద్యా అవకాశాలు, నైపుణ్య శిక్షణ అందించడంపై దృష్టి పెట్టాల్సిన బాధ్యతను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గిరిజన ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
కురుపాం మండలం టేకరికండిలో 105 ఎకరాల్లో 153 కోట్ల రూపాయల అంచనాతో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి 2020 అక్టోబరు 2న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తొలుత ఈ కళాశాల తన పరిధిలో ఉండడంతో కాకినాడ జేఎన్‌టీయూ 23 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. 2022 జనవరిలో విజయనగరంలోని జేఎన్‌టీయూ గురజాడ పరిధిలోకి వచ్చింది. అధికారుల లెక్కల ప్రకారం కళాశాల భవన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 40శాతం మాత్రమే పూర్తి అయ్యాయి.
కళాశాల ప్రారంభానికి ఒక బ్లాక్ సిద్ధం చేయాలన్నా ఆరు నెలలపైనే సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్కో బ్రాంచిలో 60 చొప్పున సివిల్, మెకానికల్, CSE, E.E.E, E.C.E.విభాగాల్లో 300 సీట్లకు 2022లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 80బోధన, 6బోధనేతర పోస్టుల మంజూరుతో పాటు 48మంది పొరుగు సేవల సిబ్బంది నియామకానికి ఉత్తర్వులు ఇచ్చారు.
2020-21 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూ విజయనగరం ప్రాంగణంలోనే తరగతులు నిర్వహించాలని, కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యాక కురుపాం తరలించాలని అధికారులు ప్రతిపాదించినా ప్రభుత్వ ఆమోదం లభించలేదు. హేతుబద్ధీకరణ నేపథ్యంలో కళాశాలకు మంజూరైన బోధన పోస్టులను జేఎన్‌టీయూకి మళ్లించారు. బోధన పోస్టులు మళ్లీ మంజూరవుతాయని, కళాశాల భవనాలు పూర్తి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జేఎన్‌టీయూ గురజాడ ఉపకులపతి వెంకట సుబ్బయ్య చెబుతున్నారు.